ఈ తప్పులు మీరు చేస్తున్నారా?
- thedirector108
- Jan 19, 2024
- 1 min read
1.భోజనం చేసేటప్పుడు కడుపుపై చేయి వుంచి నిమరకండి. అది దరిద్ర దేవతకు స్వాగతం పలకటమే అవుతుంది.
2. చాకు, కత్తి వాటితో సరదాకైనా నేలపై గీతలు గీయకండి. అవి. మరణాన్ని కోరుతాయి.
కత్తి, చాకు వంటి వాటితో ఎదుటి వారిని చూపించవద్దు. అవి బలికోరటమే కాక, ఎదుట వారి వల్ల మీరు సమస్యలో ఇరుక్కుంటారు.
3. మీరు కూర్చుని ఇతరులతో మాట్లాడేటప్పుడు కాలి బొటనవ్రేలి గోరుతో నేలను గోకవద్దు. భూదేవి శాపం పెడుతుందని మన పెద్దల నమ్మకం. ఉండటానికి ఇల్లు లేకుండా పోతుంది అని పెద్దల నమ్మకం.
4. అనుకోకుండా, మీ ఇంట్లోకి ఒక కప్ప వస్తే త్వరలోనే మీ ఇంటికి సంపదలు వస్తున్నాయని గ్రహించండి.
5. ఆకారణంగా పాలు చేతి నుండి జారి నేల పాలైనట్లయితే త్వరలో శుభ కార్యముల ద్వారా ధనం ఖర్చు అవుతుంది.
6. విరిగిన బొమ్మలు, వెలవెల బోయె కాలెండర్లు, ఇంటిలో కన్పిస్తుంటే సుఖసంతోషాలకు దూరం అయి తెలియని బాధతో మనస్సున ఇబ్బందులు ఏర్పడుచుండును. ఆ ఇంటిలో నివసించు వారికి ఎవ్వరికి కళాకాంతులు కన్పించవు.
7. నేలపాలైన కుంకుమ నుదుట బొట్టు పెట్టుకుంటే భార్య భర్తల మధ్య ఎడబాటు లేదా వైధవ్య యోగము పొందవలసి వచ్చును. పెంపుడు జంతువులు కంటినుండి నీరు కారుస్తుంటే యజమానికి త్వరలోనే ఆపద సంభవింస్తుంది.
8. రోగంతో ఉన్న వ్యక్తిని నిండు గర్భంతో ఉన్న స్త్రీ తాకితే ఆ వ్యక్తికి మరణం సంభవిస్తుంది.
9. ప్రయాణమై వెళ్ళేటప్పుడు చెట్టుకు తగిలి వస్త్రము చినిగినా కార్యనాశనము, కలహములు, వస్త్రం కిందికి జారిపడిన అనుకోని విశేషం ఏమైన జరుగవచ్చు.
10. యజమానికి తన కుక్క తలను ఎడమకాలపై పెట్టకొని కానవస్తే ధనలాభం, అదేకుక్క కుడికాలుపై తలవంచుకొని పడుకున్నట్లు కన్పిస్తే నీలాపనిందలు జగడాలు, కుడికాలు మీదున్న తలను ఎడమకాలు మీద మార్చుకుస్నట్లయితే శుభ సూచిక, ఎడమకాలు మీదున్న తలను కుడికాలుపైకి మార్చుకొన్నట్లయితే ఏదో ప్రమాదం సంబవించును.
11. ఇంటిలోని కసువును ఈశాన్య మూలగా ఊడ్బే స్త్రీ భర్తతో సంసార జీవితం సరిగా గడపలేదు. స్త్రీ సంతతికి అరిష్టం, సంపదలు హరించి దరిద్రానికి గురికావలసి వస్తుంది.
Comments